Type Here to Get Search Results !

తుమ్మెద పాటలు

తుమ్మెద పాటలు
దశరా పండుగ వచ్చిందీ అంటే ఆంధ్ర దేశపు పల్లెల్లో కూలీ స్త్రీలు చక్కగా రంగు రంగుల చీరలు చరించి, కొప్పులో బంతి పువ్వులు చుట్టి వయ్యారంగా సీతా కోక చిలుకల్లా మృదు మధురమైన కంఠంతో 

రావె రావె నల్ల తుమ్మెదా, మంచి

పాటలెన్నో పాడు తుమ్మెదా

పండవులు పాండవులు తుమ్మెదా

పంచ పాండవులారె తుమ్మెదా.



అంటూ ఇంటింటికి తిరిగి



కొత్త పంటొచ్చింది తుమ్మెదా

మనకు కరువేమి లేదింక తుమ్మెదా.



అంటూ తుమ్మెదల జట్టుల్లాగా స్త్రీ కూలీలు ఈ కళా రూపాన్ని ప్రచారం లోకి తీసుకు వచ్చారు. ఈ పాటలనే ప్రజానాట్య మండలి కరువు పరిస్థితుల ననుసరించి అధిక పంటలు పండించ వలసిందిగా రైతుల నుద్బోధించ టానికి పాటలు వ్రాసి ప్రచారం చేశారు.




Top

Bottom